‘టాక్సిక్’ నుంచి తొలి పాట విడుదల

  • యశ్‌ ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ వీడియో సాంగ్ విడుదల
  • ఆకట్టుకుంటున్న యశ్‌, కియారా అద్వానీల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ
  • గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ తారాగణం
  • ఆగస్టు 26న సినిమా ప్రపంచవ్యాప్త విడుదల
యశ్‌ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ పేరుతో తొలి వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

పాటలో యశ్‌, కియారాల జోడీ, వారి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. విజువల్స్ పరంగా పాట బాగుందని చెప్పచ్చు. ఈ పాట తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి భారీ తారాగణం నటిస్తోంది. రవి బస్రూర్, తనిష్క్ బాగ్చీ సంగీతం అందిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై యశ్‌ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


Yash
Kiara Advani
Toxic Movie First Song
Tabahi Video Song
Geetu Mohandas
Toxic Movie Release Date

More Telugu News